అక్షరటుడే, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇది కేవలం కంపార్టుమెంట్లలో వేచిఉన్న భక్తులకు దర్శనానికి పట్టే సమయం. నిన్న వేంకటేశ్వర స్వామిని 59,776 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,386 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 4.24 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.