అక్షరటుడే, హైదరాబాద్: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. నారాయణపేట జిల్లాలోని అప్పకపల్లెలో సీఎం రేవంత్ ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. తొలి విడతలో 72,045 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతారు. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సబ్సిడీతో ఆర్థిక సాయం చేస్తారు. ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన అనంతరం నారాయణపేట జిల్లాలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తారు. స్థానికంగా పెట్రోల్ బంక్‌ను ప్రారంభిస్తారు. సాయంత్రం సీఎం రేవంత్ బహిరంగ సభలో పాల్గొంటారు. పోలేపల్లి రేణుక ఎల్లమ్మ జాతరలో పాల్గొని పూజలు చేస్తారు.