అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కేసీఆర్‌ అసెంబ్లీకి రావట్లేదని పేర్కొంటూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ఫార్మర్స్‌ ఫెడరేషన్‌కు చెందిన సభ్యుడు విజయ్‌పాల్‌ రెడ్డి న్యాయస్థానంలో పిల్‌ దాఖలు చేశారు. కేసీఆర్‌ అసెంబ్లీకి రాకపోతే స్పీకర్‌ తక్షణమే చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.