అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలోని ధోబిఘాట్ వద్ద ప్రమాదవశాత్తు డేరాకు నిప్పంటుకొని అందులో నివసించే సీతారామారావు(75) మృతి చెందాడు. ఆర్మూర్ ఎస్​హెచ్​వో సత్యనారాయణ కథనం ప్రకారం.. సీతారామారావు కొన్నేళ్లుగా పక్షవాతంతో బాధ పడుతున్నాడు. ధోబీఘాట్​ ప్రాంతంలో డేరా వేసుకొని అందులో నివసిస్తున్నాడు. గురువారం రాత్రి ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. సీతారామరావు డేరాలోనే కాలిపోయి మృతి చెందాడు. మృతుడి కుమారుడు రామేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్​హెచ్​వో తెలిపారు.