అక్షరటుడే, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఫొటోలు మార్ఫింగ్ చేసిన వారిపై జనసేన కార్యకర్తలు కేసులు పెడుతున్నారు. పవన్ కల్యాణ్ ఇటీవల కుటుంబంతో కలిసి కుంభమేళాలో పుణ్యస్నానం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో జనసేన పార్టీ కార్యకర్తలు ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఫొటోలు మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.