అక్షరటుడే, ఆర్మూర్: వ్యవసాయ మార్కెటింగ్‌ జాతీయ విధాన ముసాయిదాను వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్ డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో రైతుల నిరసన యాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు భూమన్న, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి సిర్ప లింగం, రైతు సంఘం నాయకులు గణేష్, సాయిలు, నర్సింగ్, ఎర్రన్న, కుల్దీప్ శర్మ తదితరులు పాల్గొన్నారు.