అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా అప్పకపల్లిలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంక్ నిర్వహణను మహిళలే చేపట్టడం అభినందనీయమన్నారు. మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం ఇస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఒక్కో సమస్యను పరిష్కరిష్కరిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.