అక్షరటుడే, జుక్కల్: కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని కామారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారిణి భాగ్యలక్ష్మి హెచ్చరించారు. బుధవారం నిజాంసాగర్ లోని పలు విత్తన, ఎరువుల దుకాణాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విత్తన నిల్వలు, రిజిస్టర్లను పరిశీలించారు. రైతులవారీగా అమ్మిన విత్తనాల వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని వ్యాపారులను ఆదేశించారు. ఆమె వెంట మండల వ్యవసాయాధికారి అమర్ ప్రసాద్, వ్యవసాయ విస్తరణ అధికారులు స్వర్ణలత, మధుసూదన్, గ్రీష్మ, రేణుక ఉన్నారు.