అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: అమెరికాలో ఇటీవల నిర్వహించిన ఈసీఎస్ సమావేశంలో భారత్ తరపున జిల్లా జనరల్ ఆస్పత్రి సీనియర్ రెసిడెంట్(పాథాలజీ) వైద్యురాలు ఉమాదేవి పాల్గొన్నారు. కాలిఫోర్నియాలో జరిగిన 245వ సమావేశంలో పలు అంశాలపై అంతర్జాతీయ నిపుణులతో చర్చించారు. అలాగే తాను పరిశోధించిన రెండు అంశాలను సమర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉమాదేవిని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వివి.రావు, డాక్టర్ ఇమ్రాన్ సన్మానించారు. జిల్లా నుంచి అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడం గొప్ప విషయమని పేర్కొన్నారు.