అక్షరటుడే, వెబ్డెస్క్: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. 15 మంది సభ్యులకు మొదట 17 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే సంఖ్యాబలం లేకపోవడంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఎంఐఎం నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి ఏడుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.