అక్షరటుడే, బాన్సువాడ: బాన్సువాడ మండలం చిన్న రాంపూర్ గ్రామంలో ఓ వ్యక్తి వద్ద రెండు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ అశోక్ తెలిపారు. పక్కా సమాచారంతో ఎస్సై మోహన్ ఆధ్వర్యంలో నిందితుడి ఇంటిపై దాడి చేశామన్నారు. గ్రామానికి చెందిన ఇషా బిన్ సయ్యద్(40) తన పూర్వీకుల నుంచి వచ్చిన రెండు నాటు తుపాకులను అడవి జంతువులను వేటాడేందుకు ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. వాటిని స్వాధీనం చేసుకొని, నిందితుడిపై కేసు నమోదు చేశామని చెప్పారు..