అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: ఆర్మూర్​ ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డి తన సతీమణి రేవతిరెడ్డితో కలిసి మహా కుంభమేళాలో పాల్గొన్నారు. శుక్రవారం ఆయన ప్రయాగ్​రాజ్​లో పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుంభమేళా ఏర్పాట్లు బాగున్నాయని యోగి ప్రభుత్వాన్ని కొనియాడారు.