అక్షరటుడే, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా లాగే మరో కొత్త వైరస్ చైనాను వణికిస్తున్నట్లు సమాచారం. దీనిని ‘హెచ్‌కేయూ–5 సీవోయూ–2’ వైరస్‌గా అక్కడి శాస్త్రవేత్తలు గుర్తించారు. కోవిడ్ లాగే ఇది కూడా జంతువుల నుంచి వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని వారు భావిస్తున్నారు. ఈ వైరస్‌ను మొదటగా హాంకాంగ్‌లోని జపనీస్ పీపీస్ట్రెల్ రకం గబ్బిలాల్లో గుర్తించారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ కూడా పుట్టింది చైనాలోనే కావడం గమనార్హం.