అక్షరటుడే, బోధన్: బోధన్​ మండలం జాడి జమాల్​పూర్​‌‌–నాగన్​పల్లి గ్రామాల మధ్య ట్రాన్స్​ఫార్మర్​ను దొంగలు ధ్వంసం చేశారు. అందులోని కాపర్​ కాయిల్స్​, ఆయిల్​ ఎత్తుకెళ్లారని బోధన్​ రూరల్ ఏఈ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి తెలిపారు.