అక్షరటుడే, జుక్కల్: నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామ జూనియర్ లైన్మెన్ సంతోష్ గురువారం ఉదయం విద్యుత్తు స్తంభం పైనుంచి పడి మృతి చెందాడు. బస్వాపూర్ గ్రామానికి చెందిన సంతోష్ గత ఆరేళ్లుగా నిజాంసాగర్ మండలంలో జూనియర్ లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నారు. అచ్చంపేట గ్రామానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో మరమ్మతులు చేసేందుకు నవోదయ పాఠశాల ప్రాంగణంలో గల విద్యుత్తు స్తంభంపైకి ఎక్కాడు. అదుపుతప్పి కిందపడగా తీవ్రగాయలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఓ మంచి ఉద్యోగిని కోల్పోయామని సహచర ఉద్యోగులు, స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.