అక్షరటుడే, బిచ్కుంద: మహా శివరాత్రి వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని బిచ్కుంద సద్గురు బండాయప్ప స్వామి మఠ సంస్థాన్ పీఠాధిపతి సోమలింగ శివచార్య మహ స్వామీజీ కోరారు. బిచ్కుంద క్షేత్రంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలకు నియోజకవర్గ ప్రజలే కాకుండా, ఇతర ప్రాంతాల భక్తులు తరలిరావాలన్నారు. వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన వివరించారు.