ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి..

0

అక్షరటుడే, ఇందూరు: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్​రావు హామీ ఇచ్చారు. నగరంలోని ట్రస్మా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ఎన్నికల్లో సామాన్యులతో వ్యాపారవేత్తలు పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా ట్రస్మా సంఘంలో ప్రైవేటు పాఠశాలలకు సేవలందిస్తున్నానని గుర్తు చేశారు. తనను గెలిపిస్తే ప్రశ్నించే గొంతుకగా ఉంటానని తెలిపారు. ప్రైవేటు ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించి ప్రత్యేక చట్టం తీసుకురాడానికి తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. జూనియర్ లాయర్స్​కు స్టైఫండ్, ప్రైవేటు పాఠశాల సిబ్బందికి, జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో ట్రస్మా రాష్ట్ర కోశాధికారి జయసింహా గౌడ్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి నిత్యానందం, అరుణ్, అసోసియేట్ ప్రెసిడెంట్ నరసింహారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనార్ధన్, నారా గౌడ్, శ్రీనివాస్, నగేష్, పృథ్వి తదితరులు పాల్గొన్నారు.