అక్షరటుడే, వెబ్డెస్క్: కుంభమేళాలో ఇప్పటివరకు 60కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 22 వరకు 60కోట్ల మంది కుంభమేళాకు వచ్చారని.. మహాకుంభ్ శక్తిని ప్రపంచమే కీర్తిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. మన దేశ, రాష్ట్ర సామర్థ్యం అంటే ఇష్టపడని వారు మాత్రమే కుంభమేళాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.