ముస్లింలను అందుకే బీసీల్లో కలిపాం

0

అక్షరటుడే, వెబ్​డెస్క్​: బీసీ కుల గణన సర్వే పకడ్బందీగా నిర్వహించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ముస్లింలను బీసీల్లో కలపడంపై ఆయన వివరణ ఇచ్చారు. గతంలో ఇచ్చిన జీవోల ప్రకారం కొన్ని ముస్లిం కులాలు బీసీ జాబితాలో ఉన్నాయని తెలిపారు. దాని ప్రకారం ఎన్యుమరేటర్లు వారి వివరాలను బీసీ కులాల్లో చేర్చామని వివరించారు. దీంతో రాష్ట్రంలో బీసీ జనాభా ఫైనల్​గా 56 శాతం ఉందని తెలిపారు. సర్వేపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. కాగా కులగణనలో పాల్గొనని వారి కోసం రీ సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ఆ లెక్కలు వచ్చాక వివరాలు అప్​డేట్​ చేస్తామన్నారు. కాగా ఓసీ జనాభా పెరిగిందనే విరమర్శలపై కూడా భట్టి స్పందించారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వారిలో ఓసీలే అధికంగా ఉన్నారని.. అందుకే వారి జనాభా పెరిగిందని చెప్పారు.