అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: నగరంలోని ఒకటో టౌన్ పరిధిలో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని హబీబ్‌నగర్‌కు చెందిన హమీద్ తన కుటుంబ సభ్యులతో నాందేడ్‌లో బంధువుల ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఇంట్లో చొరబడిన దొంగలు రూ. 4లక్షల నగదు, మూడు తులాల బంగారం అపహరించుకుని పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం సభ్యులు ఆధారాలు సేకరించారు.