అక్షరటుడే, వెబ్డెస్క్: డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్తను రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో పని చేస్తున్న మాజీ డీజీపీ అంజనీకుమార్, ఐపీఎస్ అధికారులు అభిలాష బిస్త, అభిషేక్ మహంతి ఏపీలో జాయిన్ కావాలని కేంద్ర హోంశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈక్రమంలో డీజీ అంజనీకుమార్, ఐపీఎస్ అభిలాష బిస్తను తెలంగాణ ప్రభుత్వం శనివారం రిలీవ్ చేసింది. తక్షణమే ఇద్దరు ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.