అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న పలువురికి తిరిగి అప్పగించినట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 18 ఫోన్లు రికవరీ చేశామని, శనివారం వాటిని బాధితులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.