అక్షరటుడే, నిజాంసాగర్‌: పెద్ద కొడప్‌గల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థులకు ప్రవేశ పరీక్ష కోసం ఏర్పాట్లు చేసినట్లు ప్రిన్సిపాల్‌ సునీత తెలిపారు. ఆదివారం ఉదయం పరీక్ష ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. హాల్‌టికెట్‌పై తక్కడపల్లి అని ఉన్నా.. పెద్ద కొడప్‌గల్‌లోనే పరీక్ష కేంద్రం ఉంటుందన్నారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని తెలిపారు. పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని సూచించారు.