అక్షరటుడే, వెబ్​డెస్క్​: రాష్ట్రంలో కొత్త రేషన్​ కార్డుల జారీపై సర్కారు స్పష్టతనిచ్చింది. మార్చి 1వ తేదీ నుంచి కార్డులు ఇచ్చేందుకు నిర్ణయించింది. జనవరి 26వ తేదీన 16వేల కుటుంబాలకు కార్డులు ఇవ్వగా.. ఎన్నికల కోడ్​ లేని మహబూబ్​నగర్​, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మార్చి 1నుంచి రేషన్​ కార్డులు జారీ చేయనుంది. మిగితా అన్ని జిల్లాల వారికి మార్చి 8వ తేదీ తర్వాత ఇవ్వనుంది.