అక్షరటుడే, ఆర్మూర్: ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ప్రచారం నిర్వహించారు. ఎన్నికల బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన ఏర్గట్లలో ఆదివారం పట్టభద్రులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పట్టభద్రుల ఇళ్లకు వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.