అక్షరటుడే, ఆర్మూర్: బాల్కొండ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ, ఆలయ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.