అక్షరటుడే, ఇందూరు: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్​రెడ్డి సోమవారం జిల్లాకు రానున్నారు. ముఖ్యమంత్రి ఉదయం హైదరాబాద్​ నుంచి హెలీకాప్టర్​లో బయలుదేరి జిల్లాకు 11.50కి చేరుకుంటారు. అనంతరం నగరంలో పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు. తిరిగి 1.35కి నిజామాబాద్​ నుంచి బయలుదేరి మంచిర్యాలకు వెళ్లనున్నారు. కాగా.. సీఎం పర్యటన నేపథ్యంలో నగరంలోని భూమారెడ్డి ఫంక్షన్​ హాల్​లో ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారిక కార్యక్రమం కాకపోయినప్పటికీ సీఎం ప్రొటోకాల్​ ప్రకారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.