అక్షరటుడే, వెబ్‌డెస్క్: జేఈఈ మెయిన్స్ పేపర్–2 పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. బీఆర్క్/బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జనవరి 30న పరీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 15న ప్రిలిమినరీ కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు. 22న తుది కీ విడుదల చేశారు. తాజాగా ఆదివారం తుది ఫలితాలను విడుదల చేశారు. దేశశ్యాప్తంగా బీఆర్క్ పరీక్షకు 44,144 మంది, బీ ప్లానింగ్‌కు 18,596 మంది హాజరయ్యారు. జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్ష ఏప్రిల్ 1 నుంచి 8 మధ్య నిర్వహించనున్నారు.