అక్షరటుడే, కామారెడ్డి: పట్టణంలో వీధిదీపాల నిర్వహణలో మున్సిపల్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హౌసింగ్‌ బోర్డు వద్ద డివైడర్ల మధ్య ఏర్పాటు చేసిన వీధి దీపాలు పగలు వెలుగుతూ, రాత్రిపూట మాత్రం వెలగడం లేదు. అధికారులు స్పందించి రాత్రివేళల్లో వీధి దీపాలు వెలిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.