అక్షరటుడే, బోధన్​: నిజాంసాగర్​ కాలువలో పడి ఒకరు మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలం ఏఆర్​పీ క్యాంపులో ఆదివారం చోటు చేసుకుంది. నాందేడ్​కు చెందిన సోన్​ కాంబ్లే వినోద్ ఇటుక బట్టీలో పని చేయడానికి మూడు రోజుల క్రితం ఏఆర్​పీ క్యాంపు గ్రామానికి వచ్చాడు. ఆదివారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి నిజాంసాగర్​ డీ 46 కాలువలో పడి మృతి చెందాడు. మృతుడి భార్య మనీషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.