అక్షరటుడే, వెబ్​డెస్క్​: పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చాలా మంది కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ ఓటింగ్​ సరళి కొంచెం వేరుగా ఉండటంతో ప్రతిసారి చాలా ఓట్లు చెల్లకుండా పోతున్నాయి. అవగాహన లేకుండా తప్పుగా ఓటు వేస్తున్నారు.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

  • బ్యాలెట్​ పేపర్​పై అభ్యర్థులకు ప్రాధాన్యత ప్రకారం ఓటు వేయాలి.
  • మొదట నచ్చిన అభ్యర్థికి 1, తర్వాత 2, 3 ఇలా నంబర్లు వేస్తూ పోవాలి.
  • 1, 2, 3 అనే అంకెలు మాత్రమే బ్యాలెట్​ పేపర్లో అభ్యర్థుల పక్కన వేయాలి.
  • తెలుగులో ఒకటి, రెండు అని రాసినా, రోమన్​ అంకెలు వేసినా ఓటు చెల్లదు.
  • అభ్యర్థి పక్కన టిక్​ మార్క్​ పెట్టడం, బ్యాలెట్​ పేపర్​పై సంతకాలు చేయడం చేస్తే ఓటు వృథా అవుతుంది.
  • ఎంత మంది అభ్యర్థులకు అయినా ప్రాధాన్యత ప్రకారం ఓట్లు వేయొచ్చు.
  • ఒకే నంబర్​ను ఇద్దరికి వేసినా, మధ్యలో ప్రాధాన్యత నంబర్​ మిస్​ అయినా ఆ ఓటును లెక్కించరు. ఉదాహరణకు నలుగురికి ఓటు వేయాలనుకొని ప్రాధాన్యత ప్రకారం 1,2, 4 అని రాస్తే అది చెల్లుబాటు కాదు. 1, 2, 3, 4 తప్పక వేయాలి.