అక్షరటుడే, బోధన్: బోధన్‌లో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల కల్లుబట్టిలో రాజుకున్న చిన్నపాటి గొడవ ఘర్షణకు దారితీసింది. పట్టణంలోని వడ్డెర కాలనీకి చెందిన గంగాధర్ శనివారం పోలీస్ స్టేషన్ సమీపంలోని కల్లుబట్టికి వెళ్లాడు. కల్లు తాగే సమయంలో జీవన్ సింగ్ అనే వ్యక్తితో గొడవ జరిగింది. మాటమాట పెరగడంతో జీవన్‌సింగ్ తన వద్ద ఉన్న కత్తితో గంగాధర్ మెడపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితుడిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.