అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని కేర్ డిగ్రీ కళాశాలలో బీబీఏ, బీసీఏ కోర్సులకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిందని కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ శుక్రవారం తెలిపారు. నగరంలోని కళాశాలలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. 19 ఏళ్లుగా నాణ్యమైన విద్యను అందిస్తున్న తమ కళాశాలకు నూతన కోర్సులకు అనుమతి రావడం సంతోషకరమని పేర్కొన్నారు. విద్యార్థులు నిజామాబాద్ నగరంలోనే బీబీఏ, బీసీఏ, డేటా సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, డేటా సైన్స్ లాంటి కోర్సులను అభ్యసించవచ్చన్నారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ బాలకృష్ణ సందేశ్, కొయ్యాడ శంకర్, సందీప్, విజయ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.