అక్షరటుడే, ఎల్లారెడ్డి: నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం ఏడీఏ అపర్ణ హెచ్చరించారు. నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని ఎరువులు, విత్తన దుకాణాల్లో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధరల పట్టికలను, స్టాక్ రిజిస్టర్ ను, ప్రిన్సిపల్ సర్టిఫికెట్, బిల్ బుక్కులను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఏవో శ్రీనివాస్, దోమకొండ ఏవో పవన్ కుమార్, నాగిరెడ్డిపేట ఏవో విజయ్ శేఖర్, ఎస్సై రాజు, ఎల్లారెడ్డి ఎస్సై మహేశ్ తదితరులు పాల్గొన్నారు.