
అక్షరటుడే, వెబ్‌డెస్క్ Champions Trophy Final : ఛాంపియన్స్ ట్రోఫీ చివరి దశకు చేరుకుంది. భారత్-న్యూజిలాండ్ మధ్య ఆదివారం మెగా మ్యాచ్ జరగనుండగా, ఈ మ్యాచ్ కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ వర్షం వలన రద్ధయ్యే ఛాన్స్ ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పలు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో పలు జట్ల సెమీస్ అవకాశాలకు గండిపడడం మనం చూశాం. ఇప్పుడు ఫైనల్ కూడా వర్షం వలన రద్ధైతే పరిస్థితి ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. భారత్, న్యూజిలాండ్‌లలో ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా ఎవరిని ప్రకటిస్తారు అన్న ఆసక్తి నెలకొంది.
Champions Trophy Final : విజేత ఎవరంటే..
గ్రూప్ స్టేజీ మ్యాచ్‌ల సంగతి ఎలా ఉన్నా సరే సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు ఐసీసీ రిజర్వ్ డేలు ప్రకటించడం కొన్నాళ్లుగా వస్తుంది.. ఫైనల్ మ్యాచ్ వర్షం పడి ఆదివారం జరగకపోతే సోమవారం రోజు నిర్వహిస్తారు. ఒకవేళ ఆదివారం కొంత మ్యాచ్ జరిగిన తరువాత వర్షం పడి మిగిలిన మ్యాచ్‌ను నిర్వహించే పరిస్థితులు లేకపోతే.. సోమవారం రోజు ఆదివారం ఎక్కడైతే మ్యాచ్ ఆగిపోతుందో అక్కడి నుంచే మొదలు పెడతారు. అది జరగకపోతే కనీసం 25 ఓవర్ల చొప్పున అయిన మ్యాచ్‌ను నిర్వహించే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అది కూడా సాధ్యపడపోతే.. అప్పుడు ఇరు జట్లను విజేతలుగా ప్రకటిస్తారు. సూపర్ ఓవర్‌తో కూడా విజేతని ప్రకటించే అవకాశం ఉంది.
అయితే బౌండరీ కౌంట్ ఆధారంగా కూడా విజేతలని ప్రకటిస్తారు. న్యూజిలాండ్‌కి బౌండరీ కౌంట్ ఎక్కువగా ఉండడం వలన వారినే విజేతగా ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టైటిల్ విజేతకు భారీగా డబ్బులు ప్రైజ్‌మనీ మొత్తం రూ.60.6 కోట్లు. ఈ టోర్నీలో పాల్గొన్న ఒక్కో జట్టు రూ.1.08 కోట్లు అందుకుంటుది. అలాగే గ్రూప్ స్టేజ్‌లో విజయం సాధించిన జట్టుకు రూ.29.5 లక్షలు అందుతాయి. ఫైనల్‌లో గెలిచిన జట్టు ఏకంగా రూ.19.49 కోట్ల ప్రైజ్‌మనీ అందుకబోతోంది. ఫైనల్ మ్యాచ్‌లో ఓడి రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.9.74 కోట్లు ఇస్తారు. ఒకవేళ ఈ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే.. ఈ టోర్నీ ఆడినందుకు రూ.21.4 కోట్లు అందుకోబోతోంది.