అక్షరటుడే, వెబ్‌డెస్క్ Team India : ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుండగా, ఇప్పటికే ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను అన్నీ అమ్ముడుపోయాయి. భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుండడంతో.. మ్యాచ్ చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్‌కి ఎవరైనా అభిమానులు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలతో పాటు భారీ జరిమానా తప్పదని దుబాయ్ పోలీసులు తెలిపారు.
Team India : భారీ మొత్తం..
ఫైనల్ మ్యాచ్‌కు దుబాయ్ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే.. భారత కరెన్సీలో రూ.3,80,000 నుంచి రూ.22,85,000 వరకు జరిమానా విధించనున్నట్లు తెలిపారు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ రెండు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవగా.. 2000వ సంవత్సరంలో టీమ్ఇండియాను ఓడించి న్యూజిలాండ్ కప్పును ముద్దాడింది. ఈ క్రమంలో ముచ్చటగా మూడోసారి టీమ్ఇండియా కప్పును ముద్దాడాలని భావిస్తుండగా, మరోసారి భారత్‌ను ఓడించి రెండో సారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవాలని న్యూజిలాండ్ ఆరాటపడుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన వారికి ఎంత ప్రైజ్ మనీ దక్కుతుంది, భారత్ గెలిస్తే ఎంత ఇస్తారు అనే దానిపై చర్చ నడుస్తుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ మొత్తం రూ.60 కోట్లు కాగా, టోర్నీలో పాల్గొన్న ఒక్కో జట్టుకి రూ.1.08 కోట్లు, అలాగే గ్రూప్ స్టేజ్‌లో విజయం సాధించిన జట్టుకి రూ.29.5 లక్షలు అందుతాయి. ఈ క్రమంలో న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌లు గెలిచింది కాబట్టి ఆ జట్టుకు దాదాపు రూ.59 లక్షలు అందుతాయి. అలాగే మొత్తం మూడు మ్యాచ్‌లనూ గెలిచిన టీమిండియాకు రూ.88 లక్షలు అందుతాయి. ఇక, ప్రైజ్‌మనీలో మిగిలిన డబ్బు రూ.30 కోట్లు ఉండగా, ఫైనల్ విన్నర్, రన్నర్‌లకు పంచుతారు. ఫైనల్‌లో గెలిచిన జట్టు ఏకంగా రూ.19.49 కోట్ల ప్రైజ్‌మనీ అందించనుండగా, ఫైనల్ మ్యాచ్‌లో ఓడి రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.9.74 కోట్లు ఇస్తారు. ఒకవేళ ఈ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే.. ఈ టోర్నీ ఆడినందుకు రూ.21.4 కోట్లు దక్కనుంది. ఒకవేళ ఈ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే రూ. 21.1 కోట్లు దక్కించుకోనునుంది.