Rohit Sharma : ఛాంపియ‌న్స్ ట్రోఫీ త‌ర్వాత రోహిత్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోబోతున్నాడా.. టెన్ష‌న్‌లో ఫ్యాన్స్

Rohit Sharma : ఛాంపియ‌న్స్ ట్రోఫీ త‌ర్వాత రోహిత్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోబోతున్నాడా.. టెన్ష‌న్‌లో ఫ్యాన్స్
Rohit Sharma : ఛాంపియ‌న్స్ ట్రోఫీ త‌ర్వాత రోహిత్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోబోతున్నాడా.. టెన్ష‌న్‌లో ఫ్యాన్స్
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Rohit Sharma : భార‌త క్రికెట్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కెరీర్‌లో ఎన్నో విజ‌యాలు అందించారు. చిర‌స్మ‌ర‌ణీయ ఇన్నింగ్స్ ఆడాడు. గత కొంతకాలంగా టీమిండియా సారథి రోహిత్ శర్మ స్థాయికి తగిన ఆటతీరు కన‌బ‌ర‌చ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నాడు. అత‌ని ఆట తీరు అభిమానుల‌కి నిరాశ క‌లిగిస్తోంది. ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాకు రోహిత్ శర్మే కెప్టెన్ అయినప్పటికీ… చివరి టెస్టులో అతడ్నే పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోహిత్ శర్మ నుంచి భారీ ఇన్నింగ్స్ లు రాక‌పోవ‌డంతో టీమ్ కూడా అయోమ‌యంలో ప‌డింది.

Rohit Sharma : రోహిత్ నిర్ణ‌యం ఏంటి?

మెగా టోర్నీ ముగిశాక హిట్ మ్యాన్ నుంచి కెరీర్ కు సంబంధించి కీలక ప్రకటన వస్తుందని అంద‌రూ అనుకుంటున్నారు. ఇప్ప‌టికే ఆసీస్ లెజెండ్ స్టీవ్ స్మిత్, బంగ్లాదేశ్ సీనియర్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ముష్ఫికర్ రహీమ్ వన్డే క్రికెట్ కు గుడ్ బై చెప్పగా… ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ కెప్టెన్సీ వదులుకున్నాడు. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా ఏదైనా నిర్ణయం తీసుకుంటాడేమోనని అంద‌రూ ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. అంతిమ సమరంలో టీమిండియా, న్యూజిలాండ్ తలపడనుండ‌గా, ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

ఇది కూడా చ‌ద‌వండి :  Donald Trump : భారత్‌పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కిన డొనాల్డ్ ట్రంప్

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అన్న‌ట్టుగా మారింది.. గ్రూప్ దశలో మన చేతిలో చావుదెబ్బ తిన్న కివీస్.. ఇప్పుడు ఫుల్ కసి మీద ఉంది. ఈ క్ర‌మంలో అందుకే గౌతీ-రోహిత్ ద్వయం త్రిశూల వ్యూహంతో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మూడు వైపుల నుంచి న్యూజిలాండ్‌ను చుట్టుముట్టి.. కీలక ఆటగాళ్లపై ఎదురుదాడికి దిగాలని ప్లాన్స్ వేస్తున్నార‌ట‌. విరాట్ కోహ్లీ, వరుణ్ చక్రవర్తి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌ను ప్రధాన అస్త్రాలుగా వాడి టీమిండియాకి మంచి విజ‌యం అందించాల‌ని ఉవ్విళ్ళూరుతున్నార‌ట‌. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..

Advertisement