Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్ : ED | బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణా కేసులో ఈడీ దూకుడు పెంచింది. వివిధ వృత్తులు చేయడానికి బంగ్లాదేశ్ నుంచి యువతులను రప్పించి ఓ ముఠా వ్యభిచారం నిర్వహిస్తోంది. ఈ వ్యవహారంపై బండ్లగూడలో నమోదైన కేసులో తాజాగా ఈడీ ఆస్తులను అటాచ్ చేసింది. బ్యూటిషన్, టైలరింగ్ పేరుతో హైదరాబాద్ వచ్చిన యువతులు ఇక్కడ వ్యభిచారం చేస్తున్నారు. వీరికి ఓ ముఠా సహకరిస్తోంది. 20 మంది యువతులను పోలీసులు అరెస్టు చేశారు.
Advertisement