Prajavani | ప్రజావాణిపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Prajavani | ప్రజావాణిపై ప్రభుత్వం కీలక నిర్ణయం
Prajavani | ప్రజావాణిపై ప్రభుత్వం కీలక నిర్ణయం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Prajavani | ప్రజావాణిపై రాష్ట్ర ప్రభుత్వం(State government) కీలక నిర్ణయం తీసుకుంది. పారదర్శకమైన విధానాలను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రజాభవన్‌లో సాగుతున్న ప్రజావాణి డ్యాష్ బోర్డు(Prajavani dashboard)తో అనుసంధానం చేయాలని సూచించారు. ప్రజాభవన్‌(Prajabhavan)లో వారంలో రెండు రోజులు కొనసాగుతున్న ప్రజావాణిపై ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్షించారు. ప్రజలు ఇప్పటివరకు సమర్పించిన అర్జీలు, పరిష్కారానికి అధికారులు అనుసరిస్తున్న విధానాలను సీఎం(CM) తెలుసుకున్నారు.

Advertisement
Advertisement

2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 117 సార్లు ప్రజావాణి నిర్వహించినట్లు అధికారులు ముఖ్యమంత్రి(Chief Minister)కి వివరించారు. మొత్తం 54,619 అర్జీలు రాగా.. వీటిలో 68.4 శాతం (37,384) అర్జీలు పరిష్కారమయ్యాయని చెప్పారు.

ప్రజావాణిలో వివిధ విభాగాలకు ప్రత్యేక డెస్క్‌లు(Special desks) ఏర్పాటు చేశామని, గల్ఫ్ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రవాసీ ప్రజావాణి(Pravasi Prajavani) ఏర్పాటు చేసినట్లు వివరించారు. అత్యవసరమైన అర్జీలుంటే అక్కడికక్కడే పరిష్కరిస్తామని చెప్పారు.

ఇది కూడా చ‌ద‌వండి :  CM Revanth Reddy | కల్తీ కల్లు ఘటనపై సమీక్షించనున్న సీఎం

Prajavani | ప్రజావాణి డ్యాష్ బోర్డు యాక్సెస్‌ ఇవ్వండి

ప్రజావాణి డ్యాష్ బోర్డు యాక్సెస్‌(Prajavani dashboard Access)ను తనకు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తద్వారా తాను ఎక్కడ ఉన్నా ప్రజావాణి అర్జీల పరిష్కారం తీరును, ప్రజల నుంచి ఎలాంటి విజ్ఞప్తులు వస్తున్నాయో తెలుసుకునే వీలుంటుందని చెప్పారు.

సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య, అధికారులు పాల్గొన్నారు.

Advertisement