అక్షరటుడే, వెబ్‌డెస్క్: రైతు రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా ప్రతి రైతు కుటుంబానికి రూ. 2 లక్షల రుణమాఫీ చేయనుంది. ఈ మేరకు సోమవారం వ్యవసాయశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ మధ్య రుణాలు తీసుకున్న వారికి మాఫీ వర్తించనుంది. స్వల్పకాలిక పంట రుణాలకు వర్తింపజేయనుండగా.. ఆహార భద్రత కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నారు. రుణమాఫీ అమలుకు ప్రతి బ్యాంక్‌కు ఓ నోడల్ అధికారిని నియమించనున్నారు.
మార్గదర్శకాల కోసం లింక్ క్లిక్ చేయండి..