అక్షరటుడే, బోధన్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో 101 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. ఏకచక్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనుండగా, ఈ మేరకు జెండా రూపకల్పన పనులు వేగంగా జరుగుతున్నాయి. పట్టణంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని, ఇందులో భాగంగా హర్ ఘర్ తిరంగా పేరిట రూ.10కే జాతీయ జెండాలు అందిస్తున్నట్లు సేవా సమితి సభ్యులు తెలిపారు.