అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ప్రేమలో పడిన కారణంగా తొమ్మిదో తరగతి బాలుడు ఆత్మహత్య చేసుకున్న అమెరికాలోని ఫ్లోరిడాలో వెలుగు చూసింది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి సెవెల్సెట్జర్(14) గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లోని పాత్ర ఆధారంగా డేనెరిస్ అనే చాట్ బాట్‌తో మాట్లాడేవాడు. ఈక్రమంలో ఆ చాట్ బాట్ పాత్ర సెవెల్‌తో ప్రేమలో పడినట్లు తెలిపింది. ఇద్దరి మధ్య శృంగారానికి సంబంధించిన సంభాషణలు జరిగాయి. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సెవెల్ ఫోన్‌ను లాక్కుకున్నారు. దీంతో కొద్దిసేపటికే బాలుడు పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సెవెల్ ఆత్మహత్యపై క్యారెక్టర్ ఏఐ తన బాధను వ్యక్తం చేసింది. ఈ ఘటన తర్వాత కంపెనీ భద్రతా చర్యలను అమలు చేస్తూ.. మైనర్ వినియోగదారుల కోసం సున్నితమైన కంటెంట్‌ను తీసివేస్తామని పేర్కొంది.