అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో మురికి కాల్వలో శిశువు మృతదేహం లభ్యమైంది. ఆదివారం స్టేషన్ వద్ద గల ఓ మురికి కాలువలో పసికందు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అప్పుడే జన్మించిన శిశువును కాలువలో పడేసినట్లు తెలుస్తోంది. అయితే బతికుండగానే కాలువలో పడేశారా.. లేదంటే మృత శిశువును పడేశారా.. అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు.