అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తెలంగాణ శాసనసభ ఆవరణలో ఫొటోలు, వీడియోలు తీయడంపై నిషేధం విధించారు. ఈమేరకు శాసనసభ లాబీల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. విపక్షాలు చేపట్టే ఆందోళనల ఫొటోలు, వీడియోలు బయటకు వెళ్లకుండా ఉండాలనే ఇలా చేశారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.