అక్షరటుడే, బాన్సువాడ: హైదరాబాద్ లోని ఉప్పల్ వద్ద శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనం అదుపు తప్పి బాన్సువాడకు చెందిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పాత బాన్సువాడకు చెందిన నక్క సందీప్ మల్కాజ్ గిరి జిల్లా మేడిపల్లి మండలం తహసిల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న సమయంలో వాహనం అదుపు తప్పి కింద పడిపోవడంతో దుర్మరణం చెందాడు.