అక్షరటుడే, ఇందల్వాయి: బావిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన ఇందల్వాయి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని డొంకల్​ తండాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. తండాకు చెందిన లక్ష్మణ్​(13) మేకలను మేపడానికి మరో ఇద్దరితో కలిసి వెళ్లాడు. లక్ష్మణ్​ బావిలో పడిపోయినట్లు వెంట వెళ్లిన పిల్లలు చెప్పడంతో తండావాసులు వెళ్లి బయటకు తీశారు. అప్పటికే బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనతో తండాలో విషాదం చోటు చేసుకుంది.