అక్షరటుడే, వెబ్​డెస్క్: ఉత్తరప్రదేశ్​లోని అయోధ్యలో అమానుష ఘటన చోటు చేసుకుంది. దళిత యువతిని అత్యాచారం చేసిన దుండగులు కిరాతకంగా హత్య చేశారు. ఇంటి నుంచి వెళ్లిన యువతి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యంత దారుణమైన స్థితిలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెపై అత్యాచారం చేసి, కాళ్ళు చేతులు విరగొట్టడమే కాకుండా కళ్ళు పీకేశారు. కాగా.. బాధితురాలికి న్యాయం జరగకపోతే తన పదవికి రాజీనామా చేస్తానంటూ ఫజియాబాద్ ఎంపీ అవధేశ్ కంటతడి పెట్టారు.