అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కేరళలో హైదరాబాద్ అయ్యప్ప స్వాములకు చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని మాదన్నపేట, ఉప్పరగూడెంకు చెందిన స్వాములు అయ్యప్ప దర్శనానికి శబరిమలకు వెళ్లారు. వీరి బస్సు పంపా నదికి కొద్ది దూరంలో ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా, పలువురు స్వాములు గాయపడ్డారు.