Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్: తెలంగాణ సచివాలయంలో జనవరి 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, భూమిలేని నిరుపేదలకు రూ.12 వేల సాయం అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.
Advertisement