అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : రాష్ట్రంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఆరోరా ఫార్మా కంపెనీ రియాక్టర్‌లో రసాయన ప్రమాదం జరిగింది. ఈఘటనలో కార్మికుడు అనిల్‌(40) మృతి చెందారు. మరో ముగ్గురుకి తీవ్రగాయాలయ్యాయి. బాయిలర్‌ శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనస్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.